భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

BRS కార్యాలయంలో బాదె చంద్రం బర్త్ డే సెలబ్రేషన్స్

పిఎసిఎస్ చైర్మన్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పీఎసీఎస్ చైర్మన్ బాదె చంద్రం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. BRS పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పిఎసిఎస్ చైర్మన్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఈ సందర్భంగా నాయకులంతా కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం బాదె చంద్రంను శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మద్దెల రమేష్ స్వామి, కన్నపురం కృష్ణ గౌడ్, ఉమామహేశ్వర్, నవత్ మహేష్, దోమకొండ శ్రీను, కుమార్ సాగర్, నర్సింగరావు, సరాప్ శ్యామ్‌తో పాటు పలువురు BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.