భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అనారోగ్యంతో మృతి చెందిన వార్డు సభ్యురాలి కుటుంబానికి తాజా మాజీ ZPTC, ప్రముఖ సంఘ సేవకులు పబ్బ మహేష్ గుప్త ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 3వ వార్డు సభ్యురాలు ఒగ్గు మైసమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పబ్బ మహేష్ గుప్త బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన సొంత నిధుల నుంచి ₹10,000 ఆర్థిక సాయం అందజేశారు.
కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు తెలిపారు. మైసమ్మ మృతి పట్ల పలువురు గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుణంగారి రాజు, ఉప సర్పంచ్ శ్రావణి ప్రవీణ్, మాజీ సర్పంచ్ అశోక్, అధ్యక్షుడు లక్ష్మణ్, 1వ వార్డు సభ్యుడు సంజీవ్, ఆంజనేయులు, కుమార్, శ్రీశైలం, సాయి, మల్లేష్, మధు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.