భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ప్రకృతి వ్యవసాయంతో పంటలకు మేలు.. రైతులకు లాభం

ఆర్గానిక్ సాగు భూమికి బలం రైతుకు లాభం..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఆర్గానిక్ సాగుతో భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు రైతులు పంటల ద్వారా మంచి దిగుబడులు, లాభాలు పొందే అవకాశం ఉంటుందని AWPL అగ్రికల్చర్ ట్రైనర్ నరేందర్, హెల్త్ ట్రైనర్ కరుణాకర్, వెల్త్ ట్రైనర్ వసంతరావు తెలిపారు. రసాయన ఎరువులు, పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల భూమి సారాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో ‘ఆరోగ్య భారత్.. సంపన్న భారత్’ (హెల్త్ ఇండియా.. వెల్త్ ఇండియా) కార్యక్రమంలో భాగంగా రైతులకు సహజ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారతీయ కంపెనీ ఆశ్లీ పీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు రైతులకు ఆర్గానిక్ సాగు ప్రాముఖ్యత, అందుబాటులో ఉన్న ఉత్పత్తులు, వాటి వినియోగంపై వివరించారు.

ఈ సందర్భంగా ట్రైనర్లు మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తమ కంపెనీ ప్రత్యేకమైన ఉత్పత్తులను తయారు చేసిందని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగుల మందులతో పోలిస్తే ఈ ఉత్పత్తులు తక్కువ ధరలకు లభిస్తాయని, భూమికి, పంటలకు మేలు చేసేలా రూపొందించినట్లు చెప్పారు. రైతులు సాగులో వాటిని ఉపయోగించడం ద్వారా రసాయనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు.

దేశానికి 16 ఏళ్ల పాటు సేవలందించిన మేజర్ సంజీవ్ కుమార్ భారతదేశ రైతులను, వారి భూములను రసాయన ఎరువుల అధిక వినియోగం నుంచి కాపాడాలనే ఉద్దేశంతో సంబంధిత కంపెనీని ఏర్పాటు చేసినట్లు ప్రతినిధులు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో సహజ పద్ధతులను ప్రోత్సహించడం, రైతులకు ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై అవగాహన కల్పించడం తమ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

రైతులు భూమి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని, అందుబాటులో ఉన్న సహజ వ్యవసాయ విధానాలపై అవగాహన పెంచుకోవాలని ట్రైనర్లు సూచించారు. భూసారాన్ని కాపాడుకుంటూ పంటల సాగు కొనసాగించడం దీర్ఘకాలంలో వ్యవసాయానికి మేలు చేస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ బైరు రమేష్‌తో పాటు రైతులు బైరు శ్రీనివాస్ గౌడ్, బైరు శ్రీరాములు, గుండ్ల యాకయ్య, బత్తిని రాములు, బైరు యాదగిరి, ప్రసాద్, మురళి, నాయిని కొమరయ్య, పంజాల దేవరాజు, వేణు, పంజాల రమేష్, చెడుపాక రమేష్, మునిగింటి దర్గయ్య తదితరులు పాల్గొన్నారు.