భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని మెదక్ MP రఘునందన్ రావు సూచించారు. క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల్లోనూ ఉపయోగపడతాయని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి 2 శాతం కోటా ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి విద్యార్థి తమకు నచ్చిన క్రీడలో పాల్గొని, తమ గ్రామానికి, చదువుతున్న పాఠశాల లేదా కళాశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్-14, అండర్-17, అండర్-19 బాలబాలికల ఫెన్సింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన MP రఘునందన్ రావు మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు అనేక అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రధాని మోదీ క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ ఖేలో ఇండియా పోటీలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఈ పోటీల ద్వారా ఎంతోమంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. పతకాలు సాధిస్తూ తమ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఫెన్సింగ్ పోటీల్లో విజేతలు వీరే
ఈ పోటీల్లో అండర్-14 బాలికల ఫాయిల్ విభాగంలో అస్మిత, ఆధ్యా శశి, శాలిని, విగ్నేశ్వరి విజేతలుగా నిలిచారు. సాబేర్ విభాగంలో జ్యోతి, శరణ్య, హాసిని, స్వాతి, ఈపీ విభాగంలో మహిమ, జయలక్ష్మి, సారిక, సాన్విక గెలుపొందారు.
అండర్-14 బాలుర ఫాయిల్ విభాగంలో లక్కీ, అజయ్, నవతేజ్, నవదీప్, సాబేర్ విభాగంలో భరత్, మనోజ్, హర్షవర్ధన్, ప్రణీత్, ఈపీ విభాగంలో మహేందర్, భరత్ రాజ్, హరికృష్ణ, సాత్విక్ విజయం సాధించారు.
అండర్-17 బాలికల ఫాయిల్ విభాగంలో కీర్తన, భవాని, ఎస్తేర్ రాణి, ఐశ్వర్య, సాబేర్ విభాగంలో జెస్సికా, అనురాధ, వర్ష, అలేఖ్య, ఈపీ విభాగంలో సహస్ర, దీప్తి, ఐశ్వర్య, కనకలక్ష్మీ విజేతలుగా నిలిచారు.
అండర్-17 బాలుర ఫాయిల్ విభాగంలో భానుచరణ, రంజిత్ కుమార్, రాహుల్, పండు, సాబేర్ విభాగంలో రాకేష్, చరణ్, అరవింద్, ఆంజనేయులు, ఈపీ విభాగంలో రిత్విక్, రాఘవేందర్, వినయ్ కుమార్, రంజిత్ కుమార్ గెలుపొందారు.
అండర్-19 బాలికల ఫాయిల్ విభాగంలో భార్గవి, యం. శ్రీజ, అశ్విత, ఎల్. శ్రీజ, సాబేర్ విభాగంలో నిఖిత, హరిప్రియ, గీతిక, అర్చన, ఈపీ విభాగంలో నందిని, ఎస్తేర్ రాణి, ధనలక్ష్మీ, ఉషశ్రీ విజయం సాధించారు.
అండర్-19 బాలుర ఫాయిల్ విభాగంలో రాజేందర్, ప్రభాస్, స్టార్విన్, సాబేర్ విభాగంలో విత్తు, నరేష్, వరుణ్ సందేశ్, చైతన్య, ఈపీ విభాగంలో చందు, అజయ్, ఫైజాన్, జగదీష్ గెలుపొందినట్లు కోచ్ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీలకు విజేతలు
జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు వచ్చే నెల మొదటి వారంలో కరీంనగర్ జిల్లా రేకుర్తిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ తెలిపారు. విజేతల ప్రతిభ పట్ల ఉమ్మడి మెదక్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శులు నాగరాజు, శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, గణపతి, సమ్మయ్య హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్, స్పోర్ట్స్ ఇన్చార్జి ప్రమోద్, సిద్దిపేట జిల్లా BJP అధ్యక్షుడు బైరి శంకర్, కళాశాల సిబ్బంది, చేగుంట మండల BJP అధ్యక్షుడు ఎల్లారెడ్డి, భూపాల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సుజాత, మహిళా మోర్చా అధ్యక్షురాలు లావణ్య, స్వాతి, సంతోష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, రతన్ తదితరులు పాల్గొన్నారు.