భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, సెప్టెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులు

11

భారత్ సమాచార్, హనుమకొండ: కలెక్టరేట్లోని ఓ సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినిపై  అదే సెక్షన్ లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన క్యాబిన్ లో కి పిలిచి అసభ్యకరంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ బాధిత మహిళ కలెక్టర్ స్నేహ శబరీష్ కు ఫిర్యాదు చేయడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. వారం కిందట కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ తక్షణమే సీనియర్ అసిస్టెంట్ ను బదిలీ చేసారు.