భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, సెప్టెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

మన్ కీ బాత్ వీక్షించిన ఎమ్మెల్యే ఏలేటి

20

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వీక్షించారు. ప్రధాని మోదీ దేశ అభ్యున్నతికి, దేశ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు తదితర అంశాలను మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో పంచుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంనాథ్, సత్యనారాయణ గౌడ్, ముత్యం రెడ్డి , పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, సాదం అరవింద్, నవీన్, నరేందర్, జమాల్, సత్యం చంద్రకాంత్, ఆకోజి కిషన్, గంజి రాజు, ఒడ్నాల రాజు, సాత్విక్ తో పాటు పట్టణ, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: 

సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలి