భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

ఎన్నికల భద్రతకు సిద్ధం కావాలి: ములుగు ఎస్పీ 

WhatsApp Image 2025-09-29 at 8.40.16 PM

భారత్ సమాచార్.నెట్, ములుగు : జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటం, నేరాలకు శిక్షలు పడేలా చూడటంతో పాటు రాబోయే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ డా.శబరిష్ అధికారులకు స్పష్టం చేశారు. ఈరోజు (29.09.2025) జిల్లా కేంద్రంలో జరిగిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందున, అధికారులు అప్రమత్తంగా ఉండి, శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలని ఆదేశించారు.

 

ఎన్నికల సందర్భంగా డబ్బు, మందు పంపిణీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టు ట్రయల్‌లో ఉన్న కేసులలో సాక్షులు, ముద్దాయిలకు సమన్లు సక్రమంగా అందించి, నేరస్తులకు తప్పనిసరిగా శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శివం ఉపాధ్యాయ , డిఎస్పీ  కిషోర్ కుమార్, ములుగు డీఎస్పీ రవీందర్, తదితరులున్నారు.

 

మరిన్ని కథనాలు : 

 

మెడికల్ సీటు సాధించిన విద్యార్ధికి స‌న్మానం