భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: సాయుధ దళ కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తికి ప్రతీకగా భావించే ఆయుధాలకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మి చెట్టుకు పూజలు చేసి, పోలీసు వాహనాలకు కూడా శుభపూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్ పెట్రోల్ పంప్ వద్ద కూడా ఎస్పీ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ పంప్ ద్వారా 20 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, అలాగే విజయదశమి బోనస్‌ను సిబ్బందికి స్వయంగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీసులకూ, ప్రజలకూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమిని విజయాల పర్వదినంగా అభివర్ణిస్తూ, “శక్తికి ప్రతీక అయిన దుర్గామాత సమక్షంలో ఆయుధాలకు విశిష్టమైన శక్తి ఉంటుంది. ఈ పర్వదినం ప్రతి ఒక్కరికీ సుఖ సంతోషాలను కలిగించాలి” అని ఆకాంక్షించారు.
మరిన్నికథనాలు:
ఘనంగా పండిత్ దీన్ దయాళ్ జయంతి