భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, అక్టోబర్ 2025, గురువారంభారత్ సమాచార్

ఎన్నికల కోడ్‌పై పకడ్బందీ నిఘా: సిద్దిపేట కలెక్టర్

WhatsApp Image 2025-10-01 at 5.22.24 PM

భారత్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.హైమావతి ఆధ్వర్యంలో బుధవారం FST (ఫ్లయింగ్ స్క్వాడ్ టీం), SST, MCC నిఘా బృందాలకు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. సెప్టెంబర్ 29 నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని, ఫలితాలు ప్రకటించే వరకు అది కచ్చితంగా అమల్లో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

షెడ్యూల్ ప్రకారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు దశల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఓటర్లను మభ్యపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం లాంటి నిబంధనల అతిక్రమణలపై నిఘా ఉంచాలని బృందాలను ఆదేశించారు. అన్ని నిఘా బృందాలు తమ విధులను పగడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి ఫిర్యాదులకు తావు ఇవ్వొద్దని సూచించారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

పోలీస్ కమీషనరేట్ సాయుధ దళ కార్యాలయంలో ఆయుధపూజ