భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, అక్టోబర్ 2025, గురువారంభారత్ సమాచార్

వేములవాడ మున్సిప‌ల్ కమిషనర్ కీల‌క‌ హెచ్చరిక

WhatsApp Image 2025-10-01 at 6.34.20 PM

భారత్ స‌మాచార్.నెట్, రాజ‌న్న సిరిసిల్ల‌ జిల్లా : వేములవాడ మున్సిపల్ పరిధిలో గురువారం (అక్టోబర్ 2) గాంధీ జయంతిని పురస్కరించుకుని జీవహింసను, మాంసం విక్రయాలను పూర్తిగా నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ గోనె అన్వేష్ ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా అహింసా సిద్ధాంతాన్ని గౌరవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ పరిధిలోని చికెన్, మటన్, చేపల దుకాణాదారులు ఎవరూ తమ దుకాణాలను తెరవకూడదని ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

ఒకవేళ మాంసం విక్రయదారులు ఈ నిబంధనలను అతిక్రమించి దుకాణాలు తెరిచి, అమ్మకాలు జరిపినట్లయితే, వారిపై మున్సిపల్ చట్టం-2019 ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ గోనె అన్వేష్ హెచ్చరించారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి:ఎస్పీ మహేష్ బి. గితే