భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, అక్టోబర్ 2025, గురువారంభారత్ సమాచార్

ప్రజలకు దసరా శుభాకాంక్షలు- ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

WhatsApp Image 2025-10-01 at 8.10.00 PM

భారత్ స‌మాచార్.నెట్, మెద‌క్ జిల్లా : చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి (దసరా) పండుగ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఒక‌ ప్రకటనలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ దసరా పండుగ ప్రజల జీవితాలలో కొత్త వెలుగులను నింపాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దసరా పండుగ మనిషిని మంచి మార్గంలో నడిపించడానికి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.

 

తొమ్మిది రోజులపాటు జరిగిన ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్న ప్రజలు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విజయదశమి వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరారు. ఆ జగన్మాత దుర్గమ్మ దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రతి కుటుంబానికి విజయాలు సిద్ధించాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

మినీ ట్యాంక్ బండ్ వద్ద కట్ట మైసమ్మకు ప్రత్యేక పూజలు