భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం వాసవి ఇంటర్నేషనల్ సంఘం ఆధ్వర్యంలో మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నేత సకినాల కృష్ణ మాట్లాడుతూ… అహింసతో దేశానికి స్వాతంత్రం అందించిన మహాత్ముడి జాడలో ప్రతి ఒక్కరు నడవాలని అప్పుడే శాంతి నెలకొంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
2, అక్టోబర్ 2025, గురువారంభారత్ సమాచార్