భారత్ సమాచార్.నెట్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు ఆర్థిక చేయూతతో పాటు సాంకేతిక సహకారాన్ని అందించేందుకు కీలక ప్రకటన చేశారు. శుక్రవారం విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని ప్రారంభించిన అనంతరం, డ్రైవర్ల కోసం ఉబర్ తరహా మొబైల్ యాప్‌ను తయారు చేసి, బుకింగ్‌లు వచ్చేలా చేస్తామని ప్రకటించారు. ఈ యాప్ ద్వారా డ్రైవర్లు ఆటో స్టాండ్‌ల వద్ద పడిగాపులు పడే అవసరం లేకుండా సాంకేతికత ద్వారా సహకారం అందిస్తామని సీఎం స్పష్టం చేశారు.
అలాగే, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తామన్నారు. ఈ సందర్భంగా 2,90,669 మంది డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.436 కోట్లు జమ చేశామని ప్రకటించగానే, లబ్ధిదారులు తమ సెల్ ఫోన్లలో వచ్చిన బ్యాంక్ మెసేజ్‌లను చూపించి ఆనందం వ్యక్తం చేశారు. గతంలో రోడ్లు అధ్వానంగా ఉండి, జరిమానాలు వేధించాయని, కేవలం 16 నెలల్లోనే రాష్ట్ర పునర్నిర్మాణం జరిగిందని సీఎం పేర్కొన్నారు.
మరిన్ని కథనాలు :
‘షి ఆటో’ డ్రైవర్‌తో మంత్రి లోకేష్ ఆత్మీయ సంభాషణ