భారత్ సమాచార్.నెట్, మహబూబ్‌నగర్ జిల్లా : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో, కార్యకర్తలు పొత్తులతో సంబంధం లేకుండా పోటీకి సన్నద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా అయ్యగారిపల్లి గ్రామంలో జరిగిన పార్టీ గ్రామ కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన అభ్యర్థులను ఎంపిక చేసి, పోటీకి సిద్ధం కావాలని కోరారు. గత బీఆర్‌ఎస్ పదేళ్ల ప్రజా వ్యతిరేక పాలనను, బీజేపీ అవలంబిస్తున్న మతతత్వ, నియంతృత్వ విధానాలను ప్రతిఘటించే విధంగా ప్రజలు ఈ ఎన్నికల ఫలితాలతో మరోసారి బుద్ధి చెప్పాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల సహాయ కార్యదర్శి బుర్ర సమ్మయ్య, గ్రామ కార్యదర్శి బొల్లు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు :
సీఎం రేవంత్ రెడ్డిపై నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు