భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, అక్టోబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

అమెరికాలో భారతీయుడిపై కాల్పులు

8

భారత్ సమాచార్, హైద్రాబాద్: అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మోటెల్ యజమాని రాకేష్ ఏహాగబన్‌ను ఓ దుండగుడు కాల్చి చంపాడు. హత్యకు ముందు తన సహచరిపై కూడా కాల్పులు నిందితుడు జరిపాడు. గొడవ గురించి అడిగేందుకు వెళ్లగా తలపై అతి దగ్గరి నుంచి కాల్పులు జరపడంతో రాకేష్ ఏహాగబన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.  అనంతరం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుడికి గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు.

మరిన్ని కథనాలు: 

అమెరికాలో ఇద్దరు హైదరాబాదీ యువకుల మృతి