భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, అక్టోబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

CMRF చెక్కులు.. అక్రమాలకు పాల్పడ్డ 8 మంది నిందితుల అరెస్ట్

39

భారత్  సమాచార్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధి మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ నందు నమోదైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల స్కాం కేసులో ఎనిమిది మంది నిందితులు బాధితులకు వచ్చిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నకిలీ బాధితుల అకౌంట్లో వేసి మోసపూరితంగా డబ్బులు డ్రా చేసి స్కాంకు పాల్పడిన వారిని అనంతగిరి మండలం పాలారం గ్రామంలో సమాచారంతో మా పోలీసు సిబ్బంది వెళ్లి 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు  ఎస్పీ నరసింహ తెలిపారు. ఎవరైనా బాధితులు ఇలా మోసపోయినట్లయితే మేళ్లచెరువు ఎస్ఐ కి ఫిర్యాదు చేయవచ్చు అని ఎస్పీ తెలిపారు. వారి నుండి 7.30 లక్షల నగదు, లబ్ధిదారులకు ఇవ్వని 44 చెక్కులు, 6 బ్యాంక్ ఫాస్ బుక్కులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. MLA క్యాంప్ కార్యాలయం నందు పని చేసే ప్రవేట్ వ్యక్తులు వారి స్వలాభం కోసం వ్యక్తుల పేర్లు మార్చి హుజుర్నగర్ నియోజకవర్గ మాజీ MLAకి తెలియకుండా అక్రమంగా వేరే వ్యక్తుల పేర్లు మీద చెక్కులు డ్రా చేసి ఈ నేరానికి పాల్పడ్డారని అన్నారు.నిందితులు.. పెండెం వెంకటేశ్వర్లు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, పులిందిండి ఓంకార్,  మాదాసు వెంకటేశ్వర్లు,,మట్టపల్లి సైదులు,,గోట్టెముక్కుల వెంకటేశ్వర్లు, ,బెల్లంకొండ సైదులు,,బెల్లంకొండ పద్మ అని తెలిపారు. ఇట్టి CMRF చెక్కుల కేసును త్వరితగతంగా ఛేదించడంలో పర్యవేక్షణ చేసిన సూర్యాపేట్ DSP ప్రసన్నకుమార్, చాకచక్యత ప్రదర్శించిన కోదాడ రూరల్ సి.ఐ కె.ప్రతాప్ లింగం, మేళ్ళచెర్వు యస్.ఐ పి.పరమేష్, హెడ్ కానిస్టేబుల్ జూకూరి నాగేశ్వర్ రావు, లింగరాజు, కానిస్టేబుల్స్ మాదాసు రామారావు, దిలీప్ కుమార్, పాలోజు రామక్రిష్ణాచారి, నర్సింహా రావు లను సూర్యాపేట జిల్లా SP K. నరసింహ IPS ఈ సందర్భంగా అభినందించడం జరిగినది, ఇట్టి కేసులను ఛేదించిన సిబ్బందికి SP రివార్డ్స్ అందించారు.