భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, అక్టోబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: డిఎస్పీ ఎన్ లింగయ్య

40

భారత్ సమాచార్, నారాయణపేట జిల్లా:  ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం నారాయణపేట డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నల్లపు లింగయ్య జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 03 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం అందే విధంగా చూడడం జరుగుతోందని డీఎస్పీ గారు తెలిపారు. పోలీస్ స్టేషన్ కి, పై ఆఫీసులకి వచ్చే ఫిర్యాదుదారులు మధ్యవర్తులని తీసుకురావద్దని బాధితులు మాత్రమే నేరుగా వచ్చి ఫిర్యాదుకు సంబంధించిన విషయాలు తెలపాలని డీఎస్పీ తెలిపారు.