భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, అక్టోబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

గెలిపిస్తే రూ.25 లక్షలిస్తా..! గ్రామస్తులకు సర్పంచ్ ఆశావహుడి ఆఫర్

1

భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: తనను సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ. 25 లక్షలు విరాళం ఇస్తానంటూ గిరాయ గుట్ట తండా పాత్లవత్ నూరియా నాయక్ ఆఫర్ ప్రకటించాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండల పరిధిలోని గిరయ్యగుట్ట తండా గ్రామ పంచాయతీలో దాదాపుగా 550 మంది ఓటర్లు ఉండగా రిజర్వేషన్ ఖరారైంది. సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ. 25 లక్షలు విరాళంగా ఇస్తానని గిరాయగుట్ట, నాగర్లగడ్డ తండాలకు అభివృద్ధి చేసి చూపిస్తానని గ్రామానికి చెందిన రైతు పాత్లవత్ నూరియా నాయక్ తెలిపారు. తనకు ఏ పార్టీలతో సంబంధం లేకుండా వేదికగా ప్రకటించాడు. అయితే గ్రామ ప్రజలు అందరూ కలిసి దీనిపై చర్చించుకుంటున్నారు.  గ్రామస్తులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

మరిన్ని కథనాలు: 

డీఎస్పీ నిఖిత రెడ్డికి ఎమ్మెల్యే సన్మానం