భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట: వాల్మీకి జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ నరసింహా మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వాల్మీకి రచించిన రామాయణం సత్యం, నీతి, ధర్మం, కర్తవ్యబోధలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. సమాజంలో న్యాయం, సమానత్వం స్థాపనకు ఆయన ఆశయాలే ఆధారమని అన్నారు. ఆయన చూపిన నీతి మార్గంలో నడవడమే మనం వాల్మీకి మహర్షికి ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు
సమాచార హక్కు చట్టం ద్వారా పాలనలో పారదర్శకత బాధ్యత పెరుగుతుంది