భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

మహర్షి వాల్మీకి ఆశయాలు నిస్వార్థ సేవకు మార్గదర్శకం..

WhatsApp Image 2025-10-07 at 6.27.19 PM (1)

భారత్ స‌మాచార్.నెట్, వికారాబాద్ జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వాల్మీకి కేవలం ఒక కవి మాత్రమే కాదని, ఆయన ఒక యుగ పురుషుడని కొనియాడారు.

ఆది కవి రచించిన ‘రామాయణం’ సత్యం, నీతి, ధర్మం, కర్తవ్యం వంటి ఉన్నత మానవ విలువలను బోధించే మార్గదర్శక గ్రంథమన్నారు. ప్రజలకు బాధ్యతాయుతమైన జీవనం గడపడానికి, ముఖ్యంగా పోలీసు సిబ్బంది నిస్వార్థ సేవ అందించడానికి వాల్మీకి మహర్షి ఆశయాలే స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన తెలిపారు. ఈ నివాళి కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ సహా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

కాగ్న నది వరదల్లో 47 గోవుల మృతదేహాలు గుర్తింపు