భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

ఖమ్మంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

WhatsApp Image 2025-10-07 at 9.40.25 PM

భారత్ స‌మాచార్.నెట్, ఖమ్మం జిల్లా : నేర ప్రవృత్తిని విడిచిపెట్టి, సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని ఖమ్మం డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లను టౌన్ ఏసీపీ రమణమూర్తి గట్టిగా హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్‌లో చెడు ప్రవర్తన గల వారికి మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమణమూర్తి మాట్లాడుతూ.. రౌడీషీటర్ అనే పదం వారి పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందనే వాస్తవాన్ని గ్రహించాలని సూచించారు. నేరప్రవృత్తిని మార్చుకోవడానికి ఇది ఒక అవకాశం అని, లేనిపక్షంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

 

రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే అదుపులోకి తీసుకుని బైండోవర్ చేసి, అవసరాన్ని బట్టి పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. గతంలో ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పూర్తిగా మారితే రౌడీ షీట్ తొలగించే అవకాశం కూడా ఉందని రమణమూర్తి తెలిపారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

పాము కాటుకు మహిళా రైతు మృతి