భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, అక్టోబర్ 2025, గురువారంభారత్ సమాచార్

మానవత్వం చాటుకున్న FRO తేజస్విని

19

భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా:  పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని మానవత్వం చాటుకున్నారు. కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలో కొమరం నాగేశ్వరరావు అనే వ్యక్తి అనారోగ్యంతో  మరణించారు. అతనికి ముగ్గురు ఆడపిల్లలు, చిన్నవారు అని తెలుసున్న తేజస్విని తన వంతుగా  రూ.5000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆమె బాధిత కుటుంబంతో చరవాణి ద్వారా మాట్లాడుతూ.. కుటుంబంలో మగ పిల్లగాడు ఎంతో ఆడపిల్ల కూడా అంతే అన్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలె బోయిన సాంబశివరావు, రామారావు, కొమరం కాంతారావు, గ్రామ పెద్దలు ఉన్నారు. గ్రామ పెద్దలు తేజస్విని ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని కథనాలు:

అశ్వాపురంలో సబ్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు