భారత్ సమాచార్.నెట్, ఆదిలాబాద్ : సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. డబ్బుపై అత్యాశతో, ఉద్యోగంపై ఆసక్తితో, తక్కువ సమయంలో లోన్ వస్తుందనే ఆశతో అమాయక ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వారం జిల్లా సైబర్ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయని, నేరగాళ్లు ప్రస్తుతం ఏఐ (AI) ఆధారిత వీడియో కాల్స్, ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లతో కొత్త రీతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
లోన్ ఫ్రాడ్, ఉద్యోగ మోసాల పట్ల ప్రజలు చైతన్యంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరానికి గురైన వెంటనే గోల్డెన్ హవర్ (మొదటి గంట) చాలా ముఖ్యమైనదని, ఆ సమయంలోనే పోగొట్టుకున్న డబ్బును బ్యాంకుల వద్ద ఆపి ఉంచే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. తక్షణమే ప్రజలు జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ సంప్రదించాలని లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ఆయన కోరారు.
మరిన్ని కథనాలు :