భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, అక్టోబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

భారీ వర్షం.. 6వేల కోళ్లు మృత్యువాత

WhatsApp Image 2025-10-13 at 5.43.59 PM

భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షం ఓ పౌల్ట్రీ ఫామ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. చౌటుప్పల్ మండలంలోని నక్కలగూడెం గ్రామానికి చెందిన యాస యాదిరెడ్డి ఫామ్ పూర్తిగా నీట మునిగి దాదాపు ఆరువేల కోళ్లు ఊపిరాడక చనిపోయాయి. ఫామ్‌కు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతోనే వరద నీరు నిలిచిపోయి ఈ భారీ నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. కోళ్ల లిఫ్టింగ్ సమయానికి ఇలా జరగడంతో లక్షల రూపాయల పెట్టుబడి, శ్రమ వృథా అయ్యిందని యాదిరెడ్డి కన్నీరుమున్నీరయ్యారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

బాత్క నవీన్ కుటుంబానికి స్నేహితులు ఆర్థిక చేయూత