భారత్ సమాచార్.నెట్, మెదక్: నర్సాపూర్ రైతు వేదికలో గురువారం సాయంత్రం జిల్లా వ్యవసాయ అధికారి దేవ కుమార్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. నర్సాపూర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో కలిసి ఆయన వ్యవసాయ శాఖ కార్యకలాపాల పురోగతిని సమీక్షించారు. పంట నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన ఆయిల్ పామ్ సాగు కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం, నత్తనాయిపల్లి గ్రామంలోని వరి పొలాలను సందర్శించి, రైతులకు సుడి దోమ, అగ్గి తెగులు, మెడ విరుపు వంటి వ్యాధులకు పాటించాల్సిన సస్య రక్షణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు
నర్సాపూర్ బస్టాప్ వద్ద వాహన తనిఖీలు