భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలో గల ఆదివాసీ కుటుంబం కొమరం నాగేశ్వరావు మరణించారు. అతడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు అని తెలిసి చలించిపోయిన వెంకటాపురం గ్రామం ఆదివాసీ యువకులు రూ. 6100/- ఆర్థిక సహాయాన్ని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆ కుటుంబంకు అందించి కుటుంబానికి అండగా నిలిచారు. వీరి సహృదయాన్ని చూసి ఆ గ్రామ పెద్దలు అభినందించారు. ఇకముందు కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటన జరిగినచో ప్రతి ఆదివాసీ యువత ముందుండాలని ఈ సందర్బంగా గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం యువకుడు కొమరం రవి, తాటిగూడెం గ్రామ పెద్దమనిషి పోలెబోయిన రామారావు, పోలెబోయిన వెంకటనారాయణ, చందా ప్రదీప్, పూనెం లక్ష్మణ్, కొమరం వరుణ్, కొమరం ప్రశాంత్, కొమరం ప్రవీణ్, సోలం క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
టేకు దిమ్మలు పట్టివేత