భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాలు ఇచ్చిన బంద్‌కు పినపాక మండలంలో ఏ ఒక్క పార్టీ నాయకుల సహకారం లేదని టీడీపీ మండల అధ్యక్షుడు తోటా వెంకటేశ్వర్లు మండిపడ్డారు. శనివారం ఉదయం ఈ బయ్యారం క్రాస్ రోడ్డులో మాట్లాడుతూ.. టీడీపీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగిస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు బీసీలను అణగదొక్కేందుకే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. బీసీలకు న్యాయం జరిగే వరకూ టీడీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
మరిన్ని కథనాలు
మణుగూరులో బంద్ ప్రశాంతం