భారత్ సమాచార్.నెట్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : అధిక మోతాదులో ఉప్పు వాడకం ఆరోగ్యానికి హానికరమని, ప్రత్యేకించి రక్తపోటు వంటి సమస్యలకు దారితీస్తుందని బెజ్జూర్ మండలంలోని సలగుపల్లి ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో, సబ్ సెంటర్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య సిబ్బంది “అయోడిన్ ఉప్పు వాడండి, ఆరోగ్యంగా ఉండండి!” అనే నినాదాలు చేస్తూ వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఎన్ఎం మంజుల మాట్లాడుతూ.. ప్రజలు తప్పనిసరిగా అయోడిన్ కలిగిన ఉప్పునే వాడాలని, ఆహారంలో ఉప్పు వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విశ్వేశ్వర్, ఏఎన్ఎం మంజుల, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అధిక ఉప్పు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు మరింత స్పష్టత ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
మరిన్ని కథనాలు :
రాష్ట్రస్థాయిలో బాక్సింగ్ లో సత్తా చాటిన నితిక్ష