భారత్ సమాచార్.నెట్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఏపీవో రాజన్న తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మండలంలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య, అతని భార్య మోసం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, గ్రామ సమీపంలో అదుపుతప్పి కిందపడి గాయపడ్డారు. సమయానికి అటువైపు వెళుతున్న ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఏపీవో రాజన్న వెంటనే స్పందించారు. గాయపడిన వృద్ధ దంపతులను చూసి విస్మరించకుండా, కార్యాలయ సిబ్బందితో కలిసి వెంటనే వారిని తమ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
ముఖ్యంగా గాయపడ్డ మోసంను స్వయంగా ఆసుపత్రికి తరలించడంలో వారి చొరవ ఎంతో మంది ప్రయాణికుల ప్రశంసలు అందుకుంది. ఎలాంటి ఆలస్యం జరగకుండా తక్షణ సహాయం అందించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఏపీవో రాజన్నల సేవలను బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉండాలని చాటిచెప్పారు.
మరిన్ని కథనాలు :
ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన జిల్లా కలెక్టర్