భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో స్రవంతి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి జి. కవిత దేవి విద్యార్థులకు సాధారణ చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల భద్రత, బాల్య వివాహ నిరోధక చట్టం, పొక్సో, ఉచిత న్యాయసేవలపై వివరించారు. సమస్యలు ఎదురైతే 1098 ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
సంగారెడ్డిలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం: కలెక్టర్