భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, అక్టోబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

పకృతి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

31

భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: పాల్వంచ మండలం గుడిపాడు గ్రామంలో శ్రీ మోక్ష వేంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ N.సురేష్ రేడ్డి తనయులు N. హేమచంద్ర రెడ్డి, హర్ష రెడ్డి ఆధ్వర్యంలో మొక్క నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ రెడ్డి ,GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్, వందరోజుల శ్రీనివాస్, కృష్ణ రావుల,సోడే మధు, సూరి, పాల్గొన్నారు. ప్రతి తరమూ మొదట చిన్న పిల్లలుగానే పెరుగుతుందని, మనుషులకు చిన్నతనం నుంచి, ప్రకృతి విషయాల గురించీ, సమాజం గురించీ , సంస్కారం గురించి బాధ్యత గురించి నేర్పగలిగితే రేపటి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉంటుందని ఉద్దేశంతోనే మొక్కలు నాటాలన్నారు. పరిరక్షణ బాధ్యత కాపాడాలని, నేటి మొక్క రేపటి చెట్టు అని, అందరికీ ఆదర్శం పకృతి పరిరక్షణ బాధ్యత అని అన్నారు.

మరిన్ని కథనాలు:

విద్యార్థులతో కలిసి పోలీసుల సైకిల్ ర్యాలీ