భారత్ సమాచార్.నెట్, తిరుపతి: వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నదిలో శుక్రవారం చోటుచేసుకున్న దుర్ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతిచెందిన ముగ్గురు చిన్నారుల మృతదేహాలను ఇప్పటికే గుర్తించారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే నాని సంఘటనా స్థలంలో పర్యవేక్షిస్తూ, గాలింపు చర్యలను పటిష్ఠంగా కొనసాగించేందుకు నిరంతరం మార్గదర్శనం చేస్తున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్, ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్ సర్వీస్ బృందాలు రాత్రంతా గాలింపు చేపట్టాయి. డ్రోన్‌ల సహాయంతో నది పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందిస్తామని ఎస్పీ తెలిపారు.
మరిన్ని కథనాలు
రేణిగుంట వరద బాధితులకు ఎమ్మెల్యే బొజ్జల హామీ