భారత్ సమాచార్, ఏపీ: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ కాకినాడ వైపు దూసుకొస్తోంది. అప్రమత్తమైన అధికారులు.. తుపాన్ ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. రాబోయే 24 గంటల్లో తుపాను బలపడే అవకాశం ఉందని.. మంగళవారం (అక్టోబర్ 28) ఉదయానికి తీవ్ర తుపానుగా మారుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్ల డించింది. ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్‌కి 610కి.మీ, చెన్నైకి 790 కి.మీ, విశాఖపట్టణానికి 850 కి.మీ, కాకినాడకు 840 కి.మీ, గోపాలపూర్‌కు 950 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.. రేపు, ఎల్లుండి (సోమ, మంగళ) కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఏపీలోని 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తుపాన్లు విరుచుకుపడుతూ ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తుంటాయి. ఇండియాలోనూ తిల్లీ, హుద్ హుద్ వంటి డెడ్లియస్ట్ సైక్లోన్లు చాలా ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఇప్పుడు వచ్చిన మొంథా తుపాను కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వణికించేలా ఉంది. అయితే.. దానికి ఆ పేరు ఎవరు పెట్టారు. ఎలా పెడతారనే విషయాలు చాలా మందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. తుపానులు వచ్చినప్పుడల్లా వేర్వేరు, వింత పేర్లను వింటారు. “ఎందుకు ఈ పేర్లను ఇస్తారు?” అనేది ఒక సహజమైన ప్రశ్న. వాస్తవానికి, తుపానులకు పేర్లు ఇవ్వడం సాదాసీది ప్రక్రియ కాదు. ఇది పరిస్థితిని పర్యవేక్షించడంలో, సమాచారాన్ని ప్రజలకు సమర్థంగా చేరవేయడంలో.. రక్షణ చర్యలను సమన్వయంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషి స్తుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
13 దేశాల జాబితాలో.. ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన “మొంథా” తుపాను పేరును థాయిలాండ్ సూచించింది. థాయ్ భాషలో “మొంథా” అంటే “సువాసన పండు” అని అర్థం. ఈ పేరు, ప్రపంచ వాతావ రణ సంస్థ (WMO) ఏర్పాటు చేసిన తుపానుల పేర్ల వ్యవస్థ ప్రకారం ఎంపికైంది. ఈ జాబితాలో భారత్ సహా 13 దేశాలు ఉంటాయి. వాటి సూచనల ఆధారంగా పేర్లు అక్షరక్రమంలో ఉపయోగిస్తారు.
మరిన్ని కథనాలు:
రంగురంగుల చీరలో సందడి..