భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, అక్టోబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

మెదక్‌లో ‘ప్రజావాణి’: 4 ఫిర్యాదులు స్వీకరించిన అదనపు ఎస్పీ

WhatsApp Image 2025-10-27 at 7.46.52 PM

భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమంలో భాగంగా, అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. ఈ రోజు మొత్తం 4 ఫిర్యాదులను స్వీకరించిన అదనపు ఎస్పీ, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని కేసులలో, ఆయన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కార మార్గాలను సూచించారు.

ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా పోలీసు అధికారులను సంప్రదించాలని కోరారు. “ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి న్యాయం చేయడం పోలీస్ శాఖ ధ్యేయం. ప్రజల విశ్వాసం పెంపొందించడమే మా ప్రధాన లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించే ప్రయత్నం నిరంతరం కొనసాగుతుందని ఆయన తెలిపారు.

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

వెల్దుర్తి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యాధికారి తనిఖీలు