భారత్ సమాచార్ మెదక్ జిల్లా: రానున్న మూడు రోజులు తుఫాను ప్రభావం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డిఓ మహిపాల్ రెడ్డి కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్డి.ఎస్.ఓ, నిత్యానంద్ డి ఎం సి ఎస్. జగదీష్ తాసిల్దార్ ఎంపీడీవో మండల వ్యవసాయ శాఖ అధికారులు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పకడ్బందీ టీము వర్కుతో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కొనుగోలు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో తుఫాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాను తీవ్రత తగ్గేవరకు. కోతలు వాయిదా వేయడం వల్ల ధాన్యం పాడవకుండా ఉంటుందని, కోతలు కోయకుండా ఉంటే పంట త్వరగా ఆరడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా చేయాలని ఆదేశించారు. ధాన్యం రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆరుబయట ఉన్న ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. . అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పలిన్స్ టా రైతులకు అందుబాటులో ఉంచాలని అన్ని సౌకర్యాలు కల్పించాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు. రాబోయే మూడు రోజుల్లో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో 8,442 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మరింత వేగవంతం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
మెదక్లో ‘ప్రజావాణి’: 4 ఫిర్యాదులు స్వీకరించిన అదనపు ఎస్పీ