భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, అక్టోబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

కార్మిక సమస్యల పరిష్కారానికి సిఐటియు కట్టుబడి ఉంది

30

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్‌లో జరిగిన సిఐటియు జిల్లా 11వ మహాసభలో కార్మిక హక్కుల పరిరక్షణకు సంఘటిత పోరాటాల అవసరాన్ని నాయకులు ఉద్ఘాటించారు. మహాసభకు ముందు సీనియర్ నాయకుడు రామ్మోహన్‌రావు జెండా ఆవిష్కరణ చేశారు. అధ్యక్షతన జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్, ప్రధాన అతిథిగా రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ  కార్మిక సమస్యలు ఎక్కడున్నా సిఐటియు అండగా ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పెట్టుబడిదారులకు అనుకూల విధానాల వల్ల కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత దెబ్బతిన్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కుల, మత భేదాలకు అతీతంగా పోరాటాలు అవసరమని పిలుపునిచ్చారు. సమావేశంలో కార్యదర్శి నివేదికపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కార్మిక ప్రతినిధులు విస్తృతంగా హాజరయ్యారు.

మరిన్ని కథనాలు: 

ఏబీవీపీ బోధన్ నగర నూతన కార్యవర్గ ఎన్నికలు పూర్తి