భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, అక్టోబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

మొంథా తూఫాన్.. జిల్లాలో స్కూళ్లకు సెలవు

Untitled-22-696×495

భారత్ సమాచార్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా: మొంథా తూఫాన్ దృష్ట్యా బుధవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వీ.పాటిల్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా నేడు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

మరిన్ని కథనాలు: 

కాకినాడ వైపు దూసుకొస్తోన్న ‘మొంథా’ తుపాన్