భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: పినపాక మండలం ఎల్లాపురం గ్రామంలో వర్షాలు వచ్చినప్పుడు వరద వల్ల ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్ కు ఆదివాసి సంఘం నాయకులు తమ సమస్యను తెలియజేశారు. ఆదివారం పినపాకలో కలెక్టర్ కు గ్రామంలో సమస్యల వినతి పత్రాన్ని అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు గొగ్గల రామకృష్ణ దొర అందజేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు కొమరం.శ్రీను, సారయ్య, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
పార్టీ ఆఫీసులను ఆక్రమించే చరిత్ర మాది కాదు.. ఆ కార్యాలయం మాదే: బోడా రమేష్