భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, నవంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

ఆర్మీ, సహాయ సహకారాలకు ఆర్ధిక సహాయం చేద్దాం: అదనపు కలెక్టర్ నగేష్

22

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆర్మీ ,సహాయ సహకారాలకు ఆర్ధిక సహాయం చేద్దామని  జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో భారత స్కౌట్ అండ్ గైడ్స్ వారి వారోత్సవాల్లో భాగంగా భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ స్టిక్కర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఈ ఆవిష్కరించిన స్టిక్కర్స్ ను పాఠశాల స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు విక్రయించగా వచ్చే డబ్బులను ఆర్మీ, సహాయ సహకారాలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు . భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ లో శికష్ణ పొందిన వారు పాఠశాల,,ప్రభుత్వ ,ప్రైవేట్ సంస్థలో విక్రఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఓ రాధకిషన్, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి ఇప్ప రాజేందర్,నాగరాజు,జ్యోష్ణ, తదితరులు పాల్గొన్నారు.