భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: ఫైర్ ఎగ్జాస్టింగ్ గ్యాస్ సిలిండర్ ఆపద సమయంలో ఉపయోగించే విధానంపై పినపాక ఫైర్ స్టేషన్ సిబ్బంది గురువారం షాపు యజమానులకు అవగాహన కల్పించారు. పినపాక ఫైర్ స్టేషన్ ఎస్ఐ పి.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫైర్ ఎగ్జాస్టింగ్ గ్యాస్ సిలిండర్లు అనేవి అగ్నిని త్వరగా సమర్థవంతంగా ఆర్పివేయడానికి ఉపయోగించే ప్రత్యేక పరికరాలు అని తెలిపారు. ఇవి నీటి తో ఆర్పే వాటి కంటే భిన్నంగా పనిచేస్తాయని , ప్రత్యేకించి సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా దహనశీల ద్రవాలు పెట్రోల్, డీజిల్ పంపులు, ఉన్న ప్రదేశాలలో మంటలు చెలరేగినప్పుడు వాటిని ఆర్పడానికి ఉపయోగపడతాయి అని అన్నారు. ఈ సందర్భంగా పలువురికి ప్రత్యక్షంగా ఫైర్ ఎగ్జాస్టింగ్ గ్యాస్ సిలిండర్ ని అగ్ని సంభవించినప్పుడు ఎలా ఉపయోగించాలో ప్రత్యక్షంగా చూపెట్టారు.ఈ కార్యక్రమంలో పినపాక ఫైర్ స్టేషన్ సిబ్బంది,ఎల్ ఎఫ్ భాస్కర్,ఫైర్ మెన్ ఎన్ అజయ్ కుమార్,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
13, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్