భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారని తెలిపే విజయం జూబ్లీహిల్స్ విజయమని, కాంగ్రెస్ పై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసింది కాబట్టే మరోసారి తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఘనవిజయాన్ని కానుకగా అందించారని శివ్వంపేట మండల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. శివ్వంపేట మండల కేంద్రంలో రోడ్డుపై టపాసులు కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్, బిజిలిపురం సత్తయ్య, మంతూరి రమేష్ గౌడ్, కొడకంచి శ్రీనివాస్ గౌడ్, దావూద్ భాయ్, తిరుపతి రాథోడ్, ఇసుగారి అరుణ్, వజ్జ శీను, ఇత్తేశం, సరిగారి హరి, కార్తీక్, మహేష్, సోను, భరత్, బీస్కుంది సంతోష్, ముత్యాలు, భాస్కర్, నవీన్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
14, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్