భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జూబ్లీహిల్స్ నియోజకవర్గం, షేక్పేట్ డివిజన్ పరిధిలోని బూత్ నంబర్లు 53, 54, 55, 56 & 57లో ఆవుల రాజిరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ “జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు చూపిన ప్రేమ, విశ్వాసం మా పార్టీకి మరింత బలం చేకూర్చింది. పారదర్శక పాలన, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగడానికి ఈ ఫలితాలు ప్రజల ఆశీస్సులే. ఈ విజయానికి సహకరించిన ప్రతి ఓటరు, బూత్ స్థాయి కార్యకర్తలు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పట్ల ప్రజలు చూపుతున్న విశ్వాసం ఇటువంటి విజయాలతో మరింత బలపడుతుందని తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
15, నవంబర్ 2025, శనివారంభారత్ సమాచార్