భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై అవగాహన

WhatsApp Image 2025-11-16 at 8.25.15 PM

భారత్ సమాచార్.నెట్, నిర్మల్: డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని ముథోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. ముథోల్ బస్టాండ్ వద్ద ఆదివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రోడ్డుపై వాహనాలతో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు, పరిసరాలను గమనిస్తూ, ఇతరుల తప్పిదాలను ముందుగానే అంచనా వేయడం డిఫెన్సివ్ డ్రైవింగ్‌లో ముఖ్యమని వివరించారు.

ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని పేర్కొంటూ, రోడ్డు భద్రత నిబంధనలు పోలీసుల కోసం కాదని, మన రక్షణ కోసమే పాటించాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, వాహనదారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.