భారత్ సమాచార్.నెట్, మెదక్: జిల్లాలో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా రెండో రోజు వ్యక్తిత్వ వికాస తరగతులు, ఎన్ఎస్ఎస్ రాష్ట్ర గీతాలాపన నిర్వహించారు. జూనియర్ లెక్చరర్ టి. దేవదాస్ మాట్లాడుతూ.. దేశం కోసం, సమాజం కోసం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేయాల్సిన అంశాలను వివరించారు.
క్యాంపులో భాగంగా వాలంటీర్లు శ్రమదానం చేసి, గ్రామంలోని ప్రతి ఇంటిని సర్వే చేశారు. ఈ సర్వేలో ప్రతి ఇంటి ఆర్థిక, సామాజిక, విద్యా సంబంధిత అంశాలను, సమస్యలను నమోదు చేసి స్టిక్కర్ అతికించారు. సర్వే ద్వారా తెలుసుకున్న అంశాల మీద రేపటి నుంచి ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆటపాటల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎన్ఎస్ఎస్ పీవో జులకంటి శ్రీనివాస్ తెలిపారు.