భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, నవంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

ఫైజాబాద్ హనుమాన్ ఆలయంలో కార్తీక ఉత్సవాలు

WhatsApp Image 2025-11-18 at 2.13.09 PM

భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ జిల్లా : చిలిపిచెడు మండలం, ఫైజాబాద్ గ్రామంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. కార్తీక మాసం ప్రారంభం రోజు నుంచి నేటి మంగళవారం వరకు గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేకంగా లింగాభిషేకం నిర్వహించారు. ఈ లింగాభిషేకంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివానుగ్రహాన్ని పొందారు. కార్తీక మాసం పురస్కరించుకొని దైవదర్శనం నిమిత్తం మంగళవారం రోజున లింగాభిషేకంలో పాల్గొన్న 40 మంది భక్తులు శ్రీశైలం యాత్రకు బయలుదేరారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం దర్శనం కోసం వీరు బయలుదేరినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. భక్తులంతా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని రావాలని గ్రామస్థులు ఆకాంక్షించారు. ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి.