భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, నవంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

మహానందిలో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం

WhatsApp Image 2025-11-24 at 3.50.16 PM

భారత్ సమాచార్.నెట్, నంద్యాల: రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం మహానంది మండలంలోని సీతారామపురం గ్రామంలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్వని రైతులకు ముఖ్యమంత్రి సందేశ లేఖలను అందజేశారు.

ఎన్డీఏ ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను, రాబోయే ఐదేళ్లలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ఎంపీపీ ఈ సందర్భంగా రైతులకు వివరించారు. ముఖ్యమంత్రి తన లేఖలో “నేను రైతు బిడ్డనే, మీకు అండగా ఉంటాను” అని పేర్కొన్న సందేశాన్ని ఆమె రైతులకు చేరవేశారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకుడు బుడ్డారెడ్డి శేఖర్ రెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.