భారత్ సమాచార్.నెట్, మేడ్చల్ మల్కాజ్గిరి: అంతర్జాతీయ ఎవల్యూషన్ డే సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ప్రముఖ విజ్ఞానవేత్త పి.బి.చారి రచించిన “విశ్వం జీవం మానవుడు” పుస్తకంపై స్టడీ సర్కిల్‌ను కమలానగర్ ఆఫీస్‌లో నిర్వహించారు. గొడుగు యాదగిరిరావు సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రముఖ సామాజిక ఉద్యమ నేత జయరాజు డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాన్ని, పుస్తకంలోని శాస్త్రీయ దృక్పథాన్ని అద్భుతంగా వివరించారు.
మనిషి ఆవిర్భావం కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలోనే జరిగిందని, మతాలు చెబుతున్న విధంగా యథావిధిగా జన్మించలేదని స్పష్టం చేశారు. అనంతరం ఎం. భాస్కర్ రావు మాట్లాడుతూ.. నేటి పాలకులు శాస్త్ర విజ్ఞానాన్ని మూఢనమ్మకాలకు జోడించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆఫ్రికా ఖండంలోని ఒకే తల్లి నుంచి మానవ సంతతి అభివృద్ధి చెందిందని యాదగిరిరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, విజ్ఞానవేత్తలు పాల్గొన్నారు.