భారత్ సమాచార్.నెట్, నంద్యాల జిల్లా : ఆత్మకూరులో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ జర్నలిస్ట్ శీలం శేషు అధ్యక్షతన విద్యార్థులతో భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలో ఎంపీడీవో కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ సాగింది. ముఖ్య అతిథులుగా డివిజన్ అధికారి నాగజ్యోతి, తహసీల్దార్ రత్న రాధిక, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, ఎస్సై వెంకట నారాయణ రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుంకన్న, ఎంపీడీవో సయ్యద్ ఉమర్ హాజరయ్యారు.
1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడిందని, 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందని వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి పౌరుడు రాజ్యాంగం పట్ల విశ్వాసం, విధేయత కలిగి ఉండాలని సూచించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, మహేష్, శీలయ్య, డప్పు వెంకటేశ్వర్లు, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.