భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ తెలిపింది. తాజాగా భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB) వంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌తో పాటు ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు SSC అధికారిక వెబ్సైట్ ssc.gov.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు మార్చి 28న ముగుస్తుంది. నిరుద్యోగులు వెంటే దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఎస్ఎసీ తెలిపింది. ప్రతి ఏడాది కేంద్ర బలగాల్లో ఇలాంటి నోటిఫికేషన్ రావడం గమనార్హం. అయితే ఈసారి చాలా తక్కువ పోస్టులు రావడంతో నిరుద్యోగులు కొంత నిరాశకు గురి అయ్యారు. అయితే ఈ పోస్టుల్లో సింహభాగం మహిళలకే కేటాయించారు. అయితే ఈ ఏడాది చివరి కల్లా మరో భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని బోర్డు తెలిపింది. అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ఈ నోటిఫికేషన్ ప్లస్ పాయింట్ అవుతుంది. దీంతో పాటు కాంపిటేషన్ కూడా పెరగనున్నది.
ఖాళీల వివరాలు.. ఏజ్ ఎంతంటే..?
ఈ రిక్రూట్మెంట్లో SSC మొత్తంగా 4,187 ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. వీటిలో ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల్లో పురుషులకు 125, మహిళకు 61 పోస్టులు కేటాయించారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో ఎస్ఐ(జనరల్ డ్యూటీ) ఉద్యోగాలు 4001 భర్తీ కానున్నాయి. దరఖాస్తుదారుల వయసు 2023 ఆగస్టు 1 నాటికి కనీసం 20 నుంచి గరిష్టంగా 25 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఢిల్లీ పోలీస్‌లో ఎస్ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థులకు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే LMV (మోటార్ సైకిల్, కారు) డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.