Homemain slidesపొట్ట చుట్టూ కొవ్వు.. ఇలా చేయండి కరుగుతుంది

పొట్ట చుట్టూ కొవ్వు.. ఇలా చేయండి కరుగుతుంది

భారత్ సమాచార్, ఆరోగ్యం: మారుతున్న ఆహారపు అలవాట్లు, దానితో పాటు జీవన శైలి కూడా మన ఆరోగ్యంపై చాల ప్రభావం చూపిస్తుంది. వాటిల్లో ముఖ్యమైనది మన పొట్ట కింది చేరే కొవ్వు. ఇది చాలా మందిని ఎంతో ఇబ్బంది పెడుతుంది. దీనిని తగ్గించుకోవడానికి ఎంతో మంది వాడుకలో ఉన్న ఎన్నో రకాల డైట్ లు, వర్క్ అవుట్స్ చేసి బరువు తగ్గినా కూడా పొట్ట చుట్టూ కొవ్వు మాత్రం కరగకుండా పెద్దగా ఎలాంటి మార్పూ లేకుండా అలాగే కనబడుతూ ఉంటుంది. మరికొందరు చూడటానికి సన్నగా ఉన్నాకూడా పొట్ట చుట్టూ మాత్రం చిన్న కుండ మాదిరి షేపులో కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. బరువు తగ్గే ప్రయత్నంలో కొందరు శరీర బరువు కోల్పోయి కూడా పొట్ట దగ్గరి ఫ్యాట్ కరగకుండా అలాగే ఉంటుంది. దీనినే ఈ ఫ్యాట్ కే ‘విజరల్ ఫ్యాట్’ అని పేరు. ఇది ఒక ప్రత్యేకమైన మరియు ప్రమాదకరమైన ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ అనేది ఈ ఫ్యాట్ నే.

బాడీ ఫ్యాట్ ఎన్ని రకాలు ?
బాడీ ఫ్యాట్ ను 6 రకాలుగా వర్గీకరించారు. అవి 1. వైట్ , బ్రౌన్ , బీజ్ , ఎసెన్సియల్ , సబ్-క్యుటేనస్, మరియు విజరల్ ఫ్యాట్. అయితే ఫ్యాట్ స్టోర్ అయ్యే ప్రధాన ఫ్యాట్ సెల్స్ మాత్రం మూడు. . అవి వైట్, బ్రౌన్, బీజ్ సెల్స్ . పై 6 రకాల ఫ్యాట్లు ఈ మూడు రకాల ఫ్యాట్ సెల్స్ వద్దనే ఏర్పడతాయి. శరీరంలో స్కిన్ కింద మొత్తంగా ఉండే సబ్-క్యుటేనస్ ఫ్యాట్ వాటా అత్యధిక శాతం అయితే, పొట్ట దగ్గర పేరుకుపోయిన విజరల్ ఫ్యాట్ వాటా 10 శాతం. ఈ 6 రకాల ఫ్యాట్ లలో 5 ఫ్యాట్‌లు వాటి ప్రత్యేకమైన పనులు ఉపయోగాలు కలిగి ఉన్నాయి. మొత్తంగా మంచి – చెడు కేటగిరీలో చూస్తే ఏవి మంచివో.. ఏది చెడుదో తెలుసుకుందాం పడండి మరి.

వైట్ ఫ్యాట్ :
వైట్ ఫ్యాట్ మంచిదే. ఆర్గాన్స్ చుట్టూ, తొడల వద్దా, చేతులు, పిరిదుల వద్ద, పొట్ట దగ్గర కొంత ఈ కొవ్వు ఉంటుంది. శరీర శక్తి అవసరాలలో ఈ కొవ్వు కీలకం. ఈస్ట్రోజన్, లెప్టిన్, ఇన్సులిన్, కార్టిజాల్(స్ట్రెస్ హార్మోన్ ), హ్యూమన్ గ్రోత్ హార్మోన్(ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ ) ల పనీతిరులో ఈ ఫ్యాట్ చాలా కీలకం. అధిక మొత్తంలో ఈ ఫ్యాట్ మరలా అనర్ద దాయకమే.

బ్రౌన్ ఫ్యాట్ :
ఇది శరీరంలో కొద్దిగానే ఉన్నా కూడా, మంచిదే. పెద్దవాళ్ళలో మెడ వద్ద, భుజాల మీద స్వల్పంగా ఉంటూ, బేబీ లలో (చిన్న పిల్లలలో) ఎక్కువగా ఉంటుంది. బేబీల శరీరం ను వెచ్చగా ఉంచుతూ, ఎనర్జీ అవసరాలు చూస్తూ కాపాడుతుంది.

బీజ్(Beige) ఫ్యాట్ :
ఇది మంచి ఫ్యాట్ నే. పైన చెప్పిన వైట్ సెల్, బ్రౌన్ సెల్ ఫ్యాట్ ల పనీతిరుకు మద్యస్తమైన ఫంక్షన్స్ కలిగిఉంటుంది. దీనిపై పెద్దగా రీసెర్చ్ డేటా అందుబాటులో లేదు. శరీరం బాగా స్ట్రెస్ అయినప్పుడు లేదా కోల్డ్ , హాట్ కండిషన్స్ కు గురైనప్పుడు వైట్ సెల్ ఫ్యాట్ నే బీజ్ సెల్ ఫ్యాట్ గా మారి సంభందిత హార్మోన్స్ రిలీజ్ అయ్యేలా చూస్తుంది.

ఎసెన్సియల్ ఫ్యాట్ :
ఇది చాలా మంచి బాడీ ఫ్యాట్ . బ్రెయిన్, ఎముక మజ్జ,చిన్న ప్రేగులు, నరాల వ్యవస్థ లో ఇది కనపడుతుంది. కొవ్వు లో కరిగే విటమిన్ (Fat Soluble Vitamins) లైన A, D, E, K, K2 లను ఈ ఫ్యాట్ నే శరీరంలోకి శోషించ బడేలా చేస్తుంది. సెక్స్ హార్మోన్ల, రెగ్యులేషన్ లో, శరీర ఉష్ణోగ్రత రెగ్యులేషన్ లో ఇది కీలకమైనది.

సబ్ -క్యుటేనస్ ఫ్యాట్ :
శరీరం మొత్తం కొవ్వు లో అధిక వాటా శాతం ఉండే కొవ్వు ఇది. మూడు రకాల వైట్, బ్రౌన్, బీజ్ ఫ్యాట్ సెల్ ల వద్దా ఏర్పడుతుంది. స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ మొత్తంగా ఇదే. ఎనర్జీ అవసరాలలో ఈ ఫ్యాట్ ఉన్నా కూడా, అధిక మొత్తంలో ఇదంత మంచి ఫ్యాట్ కాదు.

విజరల్ ఫ్యాట్ :
ఇది పూర్తిగా చెడు ఫ్యాట్, లేదా అనవసరమైన ప్రమాదకరమైన వైట్ సెల్ ఫ్యాట్. పొట్ట, నడుము చుట్టూ ఏర్పడే బెల్లీ ఫ్యాట్ ఇదే. పొట్ట మీద స్కిల్ కింద సబ్-క్యుటేనస్ ఫ్యాట్ ఉంటే, దాని కింద మరో లోపలి లేయర్ లో ఈ విజరల్ ఫ్యాట్ ఏర్పడి ఉంటుంది. శరీర శ్రమ లేని ఆధునిక జీవన శైలిలో జంక్ ఫుడ్ ల ప్రభావం వల్ల బాగా పాలిష్ చేయబడ్డ రైస్, గోధుమ లాంటి అధిక సింపుల్ కార్బోహైడ్రేట్ల వల్ల లేదా కూల్ డ్రింక్స్ లాంటి షుగర్ ఫుడ్స్, ఆల్కహాల్ లాంటి ఇన్-ఫ్లమేటరీ డ్రింక్స్ వల్ల ఈ విజరల్ ఫ్యాట్ ప్రత్యేకంగా ఏర్పడుతుంది. దీన్ని వదిలించుకొక పోతే , మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్కువయి గుండె జబ్బులు, బీపీ, షుగర్, లాంటి జీవనశైలి రోగాలకు కారణమవుతుంది.

ఇది చాలా ప్రమాదకంరం:
ఇది ఎంత ప్రమాదకరమైనది అంటే, ఒక ఎక్సర్ సైజ్ చేస్తే సుమారు ఓ 100 గ్రాముల బాడీ ఫ్యాట్ కరిగింది అనుకుంటే, ఈ విజరల్ బెల్లి ఫ్యాట్ కేవలం 2 గ్రాములే ఉంటుంది. అంటే బరువు తగ్గే క్రమంలో మీరు 10 నుండి 20 కేజీల బరువు తగ్గినా కూడా ఈ విజరల్ ఫ్యాట్ వాటా సుమారు 200 గ్రాములు మాత్రమే. అందుకే బరువు తగ్గినా , పొట్ట చుట్టూ కొవ్వు అలాగే ఉండి, సవాల్ చేస్తుంది.

విజరల్ లేదా బెల్లి ఫ్యాట్ వదిలించు కోవడం ఎలా?
వాకింగ్, జాగింగ్ , యోగా,జిమ్ లాంటివి చేస్తూ, బరువు తగ్గే ప్రయత్నం చేసే వారు, ఈ పొట్ట చుట్టూ ఫ్యాట్ పూర్తిగా వదిలించుకోవాలంటే, తమ డైట్ మార్పులతో పాటు, పొట్ట కు సంభంధించిన ప్రత్యేక బెల్లీ వర్క్ అవుట్స్ తప్పనిసరి. డైట్ లో ముఖ్యంగా , ఈ ఫ్యాట్ కు కారణమైన ఆహారపు అలవాట్లు మానడం తొ పాటు, ఫైబర్ రిచ్ అయిన కూరగాయలు, ఆకుకూరలు , మినరల్ రిచ్ అయిన పండ్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అయిన మిల్లెట్స్ లాంటివి ఫ్రీఫర్ చేయాల్సి ఉంది. ప్రోటీన్ డైలీ లిమిట్ రికమండేషన్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. బెల్లీ వర్క్ అవుట్స్ లో ముఖ్యంగా , వెన్నుపూస పై లోడ్ పడే ఎక్సర్ సైజులే అధికంగా ఉంటాయి, ఇవి గనక చేస్తే, అదనపు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే స్పైనల్ కార్డ్ పై లోడ్ పడని, లేదా అతి తక్కువ లోడ్ పడే బెల్లీ ఎక్సర్ సైజులను ప్రత్యేకంగా ఎన్నుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య కథనాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉప్పు ప్రాణాలకు ముప్పు.. జాగ్రత్త..!!

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments